తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించారు. ఇక్కడ పనులు చేస్తున్న కూలీలను పలకరించారు. పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే డిసెంబర్ 9వ తేదీన సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.
సీఎంను కలిసిన సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యుడు
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యుడు జేఏ ఏరియల్ మూర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు శాలువా కప్పి సత్కరించారు.
Post Views: 21