Mahaa Daily Exclusive

  డిసెంబరు 11న కీర్తి సురేష్ పెళ్లి.. అధికారికంగా ప్రకటించిన ఆమె తండ్రి..

Share

మహానటి కీర్తిసురేష్ పెళ్ళి కన్ ఫాం అయింది. అధికారికంగా కీర్తి తండ్రి సురేష్ ప్రకటించారు. కీర్తి సురేష్ కు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఆంటోని తటిల్ తోనే వివాహం జరగబోతోందని అధికారికంగా చెప్పారు. గోవాలోని ఓ రిసార్ట్ లో వీరి వివాహ వేడుక జరుగుతుందన్నారు. దీంతో కీర్తి సురేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కీర్తి పెళ్ళి వార్త ముందుగా మహా పత్రికలో వారం క్రితమే ప్రచురితమైన విషయం విదితమే. డిసెంబరు 11 , 12వ తేదీలలో వీరి వివాహం జరగబోతోంది. నెటిజన్లు కీర్తిసురేష్ – ఆంటోని తటిల్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొన్నాళ్లుగా తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని గోవాలో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వస్తున్నాయికానీ అవన్నీ రూమర్లే అనుకున్నారు. అయితే ఆమె తండ్రి సురేష్ కుమార్ ఈ వివాహాన్ని అధికారికంగా ప్రకటించడంతో వాస్తవమే అని ధ్రువీకరణకు వచ్చారు. సోషల్ మీడియాలో కీర్తిసురేష్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మహానటితో జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి …