Mahaa Daily Exclusive

  ఢిల్లీ వాయు కాలుష్యం ఆందోళనకరం..  పరిష్కారం తక్షణ అవసరం..  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ..

Share

ఢిల్లీ,

ఉత్తర భారతంలో వాయు కాలుష్యం ఆందోళన కలిగిస్తోందని, ఇది జాతీయ అత్యవసర పరిస్థితే అని లోక్ సభప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇండియా గేట్ వద్ద పర్యావరణవేత్త ఝాతో కలిసి ఆయన మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ సోషల్ మీడియా వేదికపై పోస్ట్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో వాయు కాలుష్యంపై చర్చించి సరైన పరిష్కారం కనుగొనాలన్నారు. వాయు కాలుష్యానికి సామాన్యులే ఎక్కువగా బలవుతున్నారన్నారు.