Mahaa Daily Exclusive

  పుష్ప దర్శకుడి ఇంట్లో కొత్త సంతోషం..

Share

  • సహాయకురాలికి ప్రభుత్వ ఉద్యోగం

హైదరాబాద్, మహా

ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న పుష్ప 2 చిత్రంపై భారతీయ బాషలన్నింటిలో భారీ అంచనాలున్నాయి. పుష్ప2 రిలీజ్‌కు ఇంకా సమయం ఉండగానే వాళ్ళ ఫ్యామిలీ లో జరిగిన హ్యాపీ మూమెంట్‌ను సుకుమార్ భార్య సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సుకుమార్ ఇంట్లో ప‌నిచేసే దివ్య అనే యువతికి ప్రభుత్వ ఉద్యోగం ద‌క్కింది. ఈ విష‌యాన్ని సుకుమార్ భార్య బబిత వెల్ల‌డించింది. మా ఇంట్లో హెల్ప‌ర్‌గా చేసిన దివ్య ఇప్పుడు గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ తెచ్చుకుంది. ఈ విష‌యం మీ అంద‌రితో పంచుకోవాలి అనుకుంటున్నా అంటూ బ‌బిత వెల్ల‌డించింది. ఇక దివ్య‌కి ఉద్యోగం రావ‌డంపై సుకుమార్, అత‌డి భార్య బ‌బిత అభినందించిన ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. సుకుమార్ ఇంట్లో ప‌ని చేసుకుంటునే క‌ష్ట‌ప‌డి చ‌దువుకుంది దివ్య. మ‌రోవైపు దివ్య చ‌దువుల ఖ‌ర్చును కూడా బ‌బిత‌నే భ‌రించిన‌ట్లు స‌మాచారం.