- అల్లుఅర్జున్ సినిమాను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు
మహా: పుష్ప-2 చిత్రం విషయమై కొంతమంది పని గట్టుకుని సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని, అల్లుఅర్జున్ సినిమాను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప-2 మూవీపై సోషల్ మీడియా కామెంట్లపై ఆయన స్పందించారు. కావాలనే కొంతమంది ఆ విధంగా చేస్తున్నారన్నారు. ఎవ్వరు ఏం చేసినా పుష్ప-2 రిలీజ్ అవడం… విజయం సాధించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కూడా పలువురు ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారని అన్నారు. సినిమా బాగుంటే ఎవరు ఆపినా ప్రజలు చూడక మానరన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు పుష్ప-2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు. అందులో తాను కూడా ఉన్నానన్నారు. పుష్ప సినిమా మొదటి పార్ట్ ను తాను కూడా చూశానని, తనకు చాలా నచ్చిందన్నారు. ఈ క్రమంలోనే తాను పుష్ప-2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తునన్నారు.