Mahaa Daily Exclusive

  క‌ష్టాల్లో తోడుగా .. కంది మౌనా శ్రీ‌నివాస రెడ్డి ప‌రామ‌ర్శ‌లు..

Share

ఆదిలాబాద్ మ‌హా : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డి ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంతో పాటు జైన‌థ్ మండలంలో పర్యటించారు. పలువురు కుటుంబ పెద్దలను, ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న కుటుంబాల చెంతకు వెళ్లి ఓదార్చారు. ఆయా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఉయిక ఇందిరా భర్త, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయిక సంజీవ్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డి ప‌రామ‌ర్శించారు. జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త దోసలి గంగన్న కుమారుడు దోసలి ప్రతాప్ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంత‌రం అదే గ్రామంలో బాపూరావు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను సైతం ఆమె ప‌రామ‌ర్శించి ఓదార్చారు. అలాగే జిట్ట నర్సమ్మ కూడా మ‌ర‌ణించ‌డంతో వారి కుటుంబీకుల‌ను ప‌రామ‌ర్శించారు. కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త కుంట నర్సింగ్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతుండంతో ఆయ‌న‌ను క‌లిసి ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరాతీశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,నాయకులు బూర్ల శంకరయ్య,దాసరి ఆశన్న,గడ్డం అఖిల్ రెడ్డి,ప్రదీప్ రెడ్డి,రావుల సోమన్న, గ్రామస్తులు దీపక్ రావు,సదాలి రామన్న,ముత్యాల నిఖిలేష్,పూదరి ప్రభాకర్ రావు,కోర్రి రమేష్,సురేష్, భావ్నే రమేష్ తదితరులు పాల్గొన్నారు.