ఢిల్లీ, మహా-
కొందరు వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంట్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని, గందరగోళాలకు పాల్పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. 80-90సార్లు ప్రజలు తిరస్కరించిన వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం గూండాయిజాన్ని ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారి వ్యూహాలు చివరకు విఫలమైనప్పటికీ, ప్రజలు వారి ప్రవర్తనను నిశితంగా గమనిస్తారని తెలిపారు. ఈ మేరకు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ వద్ద ప్రధాని, ప్రతిపక్షాలపై పరోక్షంగా మండిపడ్డారు. నిరంతరం ప్రజలు తిరస్కరించే వారు తమ సహచరుల మాటలను విస్మరిస్తారని, ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ అగౌరవపరుస్తారని విమర్శించారు. పార్లమెంట్‌లో ఫలప్రదమైన చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను మోడీ కోరారు.
Post Views: 30