మహా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంటారు. సంచలన నిర్ణయాలతో ప్రత్యర్థులను హడలెత్తిస్తుంటారు. తాజాగా కూడా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడైన ఎంపీ అభిషేక్ బెనర్జీకి మమత మరింత ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనకు దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ ప్రాధాన్య అంశాలపై గళమెత్తే అదనపు బాధ్యతను అప్పగించారు. మమత బెనర్జీ తాజా నిర్ణయంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యాన్ని జాతీయ రాజకీయాల్లో పెంచుకోవడంతోపాటు ప్రత్యేకంగా ఢిల్లీలో అభిషేక్ కు ప్రాధాన్యత ఏర్పడే విధంగా వ్యూహరం రచించారని అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా పలువురు సీనియర్ నేతలకు కూడా పార్టీలో పలు పదవులను కట్టబెట్టారు.
Post Views: 27