Mahaa Daily Exclusive

  సింపుల్‌గా అఖిల్ నిశ్చితార్థం.. వచ్చే ఏడాదిలో పెళ్లి..!

Share

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జరిగింది. జైనాబ్ రవ్జీ అనే యువతితో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు అఖిల్ సిద్ధమయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో నాగార్జున పోస్ట్ పెట్టారు. అఖిల్- బైనాబ్ రవ్దీ ఎంగేజ్ మెంట్.. తన ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో జరిగినట్లు పేర్కొన్నారు. వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను నాగార్జున ఆ పోస్ట్ లో షేర్ చేశారు. అదేవిధంగా వచ్చే ఏడాది వీరి పెళ్లి ఉంటుందని ప్రకటించారు. వీరిద్దరికీ మీ ఆశీర్వాదాలు అందివ్వాలని కోరారు. ఇటు అఖిల్ కూడా నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను నెట్టింటా షేర్ చేశారు. అయితే, ఈ విషయం తెలియగానే అఖిల్ ను పెళ్లి చేసుకోబోయే జైబాబ్ ఎవరు.. ? ఆమె ఎవరి కూతురు..? ఆమె ఏం చదివారు.. ఇలా వివరాలు తెలుసుకునేందుకు అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారంటా.