26/11/2024
గోండుల జీవన సంస్కృతిలో పురుడు పోసుకున్న గుస్సాడీ నృత్యం గోవాలో జరుతున్న 55 వ ఇఫీ ఉత్సవాల్లో తెలంగాణ గిరిజన సంస్కృతీ పరిమళాలను నింపుతున్నది.. నవంబర్ 20 నుండి 28 వరకు 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) IFFIESTA గోవాలో అంగరంగ వైభవంగా జరుగు తున్నాయి.
ఇఫీ భారతీయ చలన చిత్ర రంగంలో అత్యుత్తమ చిత్రాలను ఈ ఉత్సవాల్లో ప్రదర్శిస్తుంది.
భారతదేశం అంతటా కొత్త దృక్కోణాలు, విభిన్న కథనాలు మరియు వినూత్న చిత్ర శైలులను ప్రదర్శించడానికి ఒక వేదిక. అంతేకాకుండా
అదే విదంగా IFFI భారతదేశంలోని అసామానమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని కూడా ప్రదర్శిస్తుంది.
ఇందులో భాగంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్
(గేయ మరియు నాటక విభాగం) ఈ అంతర్జాతీయ చలనచిత్ర వేదికలపై భారతదేశంలోని విభిన్న గిరిజన మరియు సాంప్రదాయ జానపద కళల నృత్య రూపాలను ప్రదర్శిస్తుంది.
ఈ ఉత్సవాల్లో
భారతదేశం అంతటా ఉన్న 10 జానపద, గిరిజన మరియు శాస్త్రీయ నృత్య బృందాలను ఎంపిక చేసింది. ఈ జానపద బృందాలు ఇఫీ అంతర్జాతీయ వేదికపై ప్రదర్శిస్తున్నాయి, ఆకర్షణీయమైన నృత్య ప్రదర్శనల ద్వారా భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వైవిధ్యం మరియు శక్తివంతమైన సంప్రదాయాలను పరిచయం చేస్తున్నాయి . ఈ ప్రతిష్టాత్మక వేదికలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ , హైదరాబాద్ ఆధ్వర్యంలో తెలంగాణకు చెంది గోండు గోండు కళాకారులు
గుస్సాడి నృత్యాన్ని ఇఫీ వేదికలపై ప్రద్శస్తున్నారు.
ప్రత్యేకించి ఆదిలాబాద్ జిల్లా రాజగోండుల తెగ వారు పౌర్ణమితో మొదలై దీపావళి పండుగ వరకు పదిహేను రోజుల పాటు దండారి పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తారు.
ఈ గుస్సాడీ నృత్యం ఇప్పుడు తెలంగాణ తో పాటు పలు రాష్టాల నుండి విచ్చేసిన కళాకారులు ఈ ఉత్సవాల్లో తమ కళా రూపాలను ప్రదర్శస్తున్నారు..
ఇటువంటి గ్రామీణ గిరిజన మరియు జానపద కళారూపాలు IFFI 2024, గోవాలోని సిటా డే హోటల్, కళా అకాడమీ, రవీంద్ర భవన్ మరియు శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం వంటి వివిధ వేదికలపై అలరిస్తున్నాయి. పలు రాష్టాలనుండే కాకుండా ఈ ప్రదర్శనలు ఇతర దేశాల నుండి వచ్చిన సినీ ప్రతినిధులు మరియు అభిమానులను ఎంతో ఆకట్టు కుంటున్నాయి.
తెలంగాణ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అడీషనల్ డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ నిర్దేశకత్వంలో
సిబిసి ,నోడల్ ఆఫీసర్
డా. జే. విజయ్ కుమార్ జీ
“గోవా ఇఫీ “ఉత్సవాల్లో గుస్సాడి ప్రదర్శనలను సమన్వయం చేస్తున్నారు.
గుస్సాడి కళాకారులు
కనక సుదర్శన్ ,
కుమ్రా సాయిరాజ్,
జుంగ్కా సంజయ్ కుమార్ ,మెస్రం, లక్ష్మణ్, సోయం రమేశ్, సిదం గోపాల్,ఆత్రం అర్జున్, కనక శ్రీకాంత్. ,మెస్రం నవనాథ్ లు ఈ ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు.
తెలంగాణ గుస్సాడి తో పాటు హిమాచల్ ప్రదేశ్ ,కాశ్మీర్ ,ఒరిస్సా ,అస్సాం కర్ణాటక ,కేరళ, తమిళనాడు రాష్టాలకు చెందిన కళారూపాలను ఇఫీ ఉత్సవాల్లో ఈ నెల 28 వరకు ప్రదర్శిస్తున్నారు.