Mahaa Daily Exclusive

  మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..? ఎందుకంటే..?

Share

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 29న ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ పెద్దలు, పార్టీ అగ్రనేతలు, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు హాజరు కానున్నారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీడబ్ల్యుసీ సమావేశానికి హాజరు కానున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు.