Mahaa Daily Exclusive

  ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్..!

Share

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ముంబై పోలీసులకు ఫోన్ చేసి హెచ్చరించారు. దీంతో అలర్టయిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టి ఓ మహిళ (34) ను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ముంబై పోలీస్ కంట్రోల్ రూంకు ఓ మహిళ ఫోన్ చేసి ప్రధాని మోదీని చంపేందుకు ప్లాన్ సిద్ధం చేశామని తెలిపింది. ఇప్పటికే ఆయుధం కూడా రెడీ చేశామని చెప్పింది. ఈ ఫోన్ కాల్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సదరు మహిళను పట్టుకున్నారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.