Mahaa Daily Exclusive

  డివైడర్ ఎక్కిన ఆర్టీసీ బస్సు..!

Share

  • -ప్రయాణికులకు స్వల్ప గాయాలు
  • -తప్పిన పెను ప్రమాదం

 

అందోల్, మహా: అందోల్ మండల పరిధిలోని కన్ సానిపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న క్రమంలో కన్ సానిపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ పైకి దూసుకెళ్లింది. డివైడర్ పైన కాస్త బస్సు ముందుకు వెళ్ళింది. ఆ సమయంలో బస్సులో 50మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అందులో 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, మిగతా ప్రయాణికులు సురుక్షితంగా బయటపడ్డారు. గాయాలైన ప్రయాణికులను వెంటనే చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్తగా, అతివేగంగా బస్సును నడపడం వలనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రయాణికులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై పాండు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంలో గాయాలై చికిత్స పొందుతున్న ప్రయాణికుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.