Mahaa Daily Exclusive

  రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక…!

Share

రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక
గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న వినతులు, వాటి పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. సత్వరమే వాటికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని వారికి సీఎం స్పష్టం చేశారు. వినతులుపై ప్రజలను అక్కడికి, ఇక్కడికి తిప్పే పరిస్థితి ఇకపై ఉంటే సహించేది లేదని అధికారులను సీఎం చంద్రబాబు హెచ్చరించారు.