Mahaa Daily Exclusive

  బస్సులో మహిళలపై యాసిడ్ దాడి…!

Share

విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని భావిస్తున్నారు.”ఈ ఘటన గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు గగ్గోలు పెట్టడంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, స్థానికుల సాయంతో బాధితులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు

సమాచారం అందుకున్న కంచరపాలెం CI చంద్రశేఖర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ‘దాడిలో ఉపయోగించినది నిజంగానే యాసిడ్ కాదు ఇతర ద్రావణమా’ అనే దానిపై పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.

ఘటన స్థానికులలో తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుల ఆరోగ్య పరిస్థితి పట్ల ఇంకా స్పష్టత రాలేదు. ఈ దాడి వెనుక కారణాలు మరియు నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

“ఇలాంటి ఘటనలు మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.