Mahaa Daily Exclusive

  ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులకు షాకిచ్చిన కేంద్రం..

Share

  • పాస్ పోర్టుల సస్పెండ్
  • కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ప్రభాకర్ రావు పిటిషన్
  • ఇంటర్ పోల్ సహాయం కోరిన పోలీసులు

 

హైదరాబాద్, మహా : పోన్ ట్యాపింగ్ వ్యవహరంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక నిందితుడని దర్యాప్తు సంస్థ భావిస్తున్న మాజీ ఐజీ ప్రభాకర్ రావు అమెరికా ప్రభుక్వాన్ని శరణార్థిగా గుర్తించాలని అభ్యర్థన పెట్టుకోగా, ఆయన పాస్ పోర్టును రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకతో ఒక ఛానల్ ఎండీ శ్రవణ్ రావులు ప్రథమ ముద్దాయిలని దర్యాప్తు సంస్థ ఇప్పటికే పేర్కొంది. వీరిద్దరూ అమెరికా పారిపోవడంతో రప్పించేందుకు అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర పోలీసులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఇంటలీజెన్స్ చీఫ్గా ప్రభాకర్ వ్యవహరించారు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసి పలువురు పోలీసు అధికారులు విచారణలో ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్లు వెల్లడించడంతో ఈ కేసు పురోగతిలో ప్రభాకర్ విచారణ, ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా దర్యాప్తు ముందుకు తీసుకు వెళ్ళేందుకు అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

 

ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు అమెరికాలోనే తిష్ట వేసి దర్యాప్తునకు సహకరించక పోవడంతో వీరిద్దరి పాస్ పోర్టును సస్పెండ్ చేయాలని రాష్ట్ర హోం శాఖ కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేకను పరిగణనలోకి తీసుకుని హోం మంత్రిత్వ శాఖ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావుల పాస్ పోర్టును సస్పెండ్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో హతాషులైన ఇద్దరు కీలక నిందితులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో పాస్ పోర్టు సస్పెండ్ ను సవాల్ చేశారు. ఈ మేరకు ప్రభాకర్ రావు న్యాయవాదులు పిటిషన్ ను దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్ పోర్టులను పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర పోలీసులు మరోసారి సిఫారసు చేశారు. హోం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులను జరుపుతూనే రాష్ట్ర పోలీసులు వీరిద్దరినీ రాష్ట్రానికి రప్పించేందుకు ఇంచర్ పోల్ సహాయాన్ని కోరారు. ఇద్దరిపై నమోదైన కేసులు, దర్యాప్తులో భాగంగా సేకరింతిన వాంగ్మూలాలను ఇంటర్ పోల్ కు సమర్పించిన రాష్టచ్ర హోం మంత్రిత్వ శాఖ వీలైనంత తొందరగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను తమకు అప్పగించాలని కోరారు. ఇందుకోసం రెడ్ కార్నర్ నోటీసును జారీ చేయలని సూచించారు. దీంతో ఈ కేసు దర్యాప్తు మరింత రసవత్తరంగా మారింది. తనకు కేసుతోనే సంబంధం లేదని, ప్రభుతక్వ ిధులలో ఉన్నప్పుడు అప్పటి పాలకులు చెప్పన పనిని చేశానని ఇప్పటికే ప్రభాకర్ రావు స్పష్టం చేయడంతో కేసు ఎక్కడ ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితులున్నాయి.