- సోమవారంతో ప్రస్తుత ఛైర్మన్ గడువు పూర్తి
- వరుస నోటిఫికేషన్లతో టీజీపీఎస్ సీ బిజీ బిజీ
హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా సీనియర్ ఐఎఎస్ అధికారి బుర్రా వెంకటేశంను నియమించింది. 2024 డిసెంబర్ 2 వరకు ప్రస్తుత ఛైర్మన్ పహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. మహేందర్ రెడ్డి పదవీ కాలం పూర్యిన వెంటనే బుర్రా వెంకటేషం బాధ్యతలు స్వీకరించనున్నారు. బుర్రా వెంకటేషం ప్రస్తుతం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ గా పని చేస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశంను నియమించారు. ఈ క్రమంలోనే ఆయనకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎఫ్ఏసీ గా కూడా బాధ్యతలు ఇచ్చారు. గతంలో ఆయన కాలేజీ విద్యాశాఖ కమిషనర్ గా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా అడిషనల్ బాధ్యతలతో పాటు తెలంగాణ యూనివర్సిటీకి ఇన్ చార్జ్ వీసీగా కూడా పని చేసిన అనుభవం ఉంది. తర్వాత గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. వరుస నోటిఫికేషన్లతో టీజీపీఎస్ సీ కార్యకలాపాలు బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమర్థుడైన అధికారికి బాధ్యతలను అప్పగించాలన్న నిర్ణయంతో సీఎం రేవంత్ రెడ్డి బుర్రాకు ఛైర్మన్ పదవి అప్పగించినట్లు స్పష్టమవుతోంది.