Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ ఏడాది పాలన డొల్ల.. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే..

Share

  • కాంగ్రెస్ పాలనపై బీజేపీ నేడు చార్జీషీట్ విడుదల
  • డిసెంబర్ 6 న సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగసభ
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

 

హైదరాబాద్, మహ : రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన బీఆర్ఎస్ పదేళ్ళ పాలనను మరిపిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఏడాది పాలనలో ఎన్నో చేశామని గొప్పలు చెప్పుకుని సంకలు గుద్దుకుంటూ ఉత్సవాలు చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఒక్క రేషన్ కార్డును కూడా జారీ చేయలేదని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయం బీజేపీయే అని తెలంగాణ ప్రజదలు భావిస్తున్నారని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, హామీల అమలు సాధన దిశగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్ ఉందని, ప్రజలు పార్చీవైపు చూస్తున్నారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన కిషన్ రెడ్డి మోడీ మాటలను నిజం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీకి బూత్ స్థాయి నుంచి నాయకత్వం అవసరమని, ఆ దిశగా మరింథ గట్టిగా ప్రయత్నం చేయాలన్నారు. గడచిన ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ ఒకక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, గత ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ లను ప్రాసెస్ చేసి ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలు చెబుతుుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆదివారం బీజేపీ చార్జీషీట్ ను ప్రజల ముందు ఉంచనున్నామని తెలిపారు. చార్జీషీట్ లో రేవంత్ పాలనలోని వైఫల్యాలను ప్రజలకు తెలుపుతామని, బీజేపీ శ్రేణులు చార్జీషీట్ లోని అంశాలను ప్రజల ముందుంచి చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు. హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అఇధికారంలోకి వచ్చింతర్వాత తప్పించుకుంటుందని, హామీలను అమలు చేసేంత వరకు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలపాలన్నారు. స్థానిక సంస్థల్లో బీజేపీ గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపి సత్తా చాటాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వార్డు మెంబర్లతో పాటుపురపాలికలు, కార్పొరేషన్లలోనూ పార్టీ బలం నిరూపించకోవాలన్నారు.

 

డిసెంబర్ 6 బహిరంగసభ

 

కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు డిసెంబర్ 6 న హైదరాబాద్ లో భారీ భహిరంగసభను నిర్వహిస్తున్నామని ప్రకటించారు. సరూర్ నగర్ ఇండోర్ స్డేియంలో నిర్వహించే ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కానీ హాజరవుతారన్నారు. ఈ సభలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాస్తవంగా అమలు చేసిన హామీలపై ప్రజలకు తెలుతామన్నారు. రాబోయే కాలంలో బీజేపీ పోషించే పాత్రపై ప్రజలకు స్పష్టత ఇవ్వనున్నామని తెలిపారు. తెలంగణలో అమలు చేయని హామీలపై పొరుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై కూడా ప్రజలకు తెలుపుతామన్నారు.