హైదరాబాద్, మహా
సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు గమనించి ఈసీఐఎల్‌లోని సమీప ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. బాలమల్లేశ్ భౌతికకాయాన్ని యాప్రాల్‌లోని ఆయన నివాసానికి తరలించారు. దీంతో అక్కడంతా విషాదఛాయలు అలుముకున్నాయి. దీర్ఘకాలంగా ప్రజా ఉద్యమాల్లో చెరగని ముద్ర వేసిన బాలమల్లేశ్కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాలమల్లేశ్ మృతిపట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బాల మల్లేశ్ మృతి సీపీఐ రాష్ట్ర సమితికి తీరని లోటన్నారు.
Post Views: 21