- ఢిల్లీలో అలజడి
- మాజీ సీఎంకు రక్షణ కల్పించలేరా?
- బిజెపిపై మండిపడ్డ ఆప్
ఢిల్లీ, మహా
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి లిక్విడ్‌ను చల్లాడు. పాదయాత్రలో భాగంగా ప్రజల మధ్య నుంచి అభివాదం చేస్తూ కేజ్రీవాల్ నడుస్తుండగా ఒక వ్యక్తి గుర్తు తెలియని ద్రవాన్ని చిమ్మడం కలకలం సృష్టించింది. అయితే వెంటనే అప్రమత్తమైన కేజ్రీవాల్ భద్రతాసిబ్బంది ఆ వ్యక్తిని వెనక్కిలాగేశారు. దీనితో అక్కడ తీవ్రమైన అలజడి ఏర్పడింది. పోలీసులు వెంటనే ఓ తాడుతో కేజ్రీవాల్ చుట్టూ భద్రతావలయంగా ఏర్పడ్డారు. ఢిల్లీలో శాంతిభద్రతలు కేంద్రహోం శాఖ పరిధిలో ఉంటాయి. తాజా ఘటన నేపథ్యంలో బీజేపీపై ఆప్ పార్టీ తీవ్రంగా మండిపడింది.
Post Views: 26