- ఆస్తులమ్ముకోవాల్సిందే అంటే నెటిజన్ల సెటైర్లు
- మల్టీప్లెక్స్ లో టికెట్ రూ.1239
- ప్రీమియర్ షోకు రూ.800
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప-2’ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రిలీజ్ తేది కంటే ముందు రోజు రెండు బెన్ ఫిట్ షోలకు సైతం అనుమతి ఇచ్చింది. అయితే ఈ షో టికెట్ ధరను భారీగా పెంచేసింది. అలాగే డిసెంబర్ 4న రాత్రి 9.30, అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలకు కూడా సర్కారు ఓకే చెప్పింది. రాత్రి 9.30 గంటల షోకు టికెట్ ధరను అదనంగా రూ. 800 పెంచింది. ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లో ఎక్కడైనా సరే ప్రస్తుతం ఉన్న ధరకు అదనంగా రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఇక పెంపుతో కలుపుకొని సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ. 1000 అవుతుంటే, మల్టీప్లెక్స్‌లో రూ. 1200లకు పైగా అవుతోంది.