రాష్ట్రంలో సంపద సృష్టి ద్వారా అభివృద్ధి చేస్తూ ఆ అభివృద్ధి ఫలాలను తిరిగి పేదలకు అందజేస్తామని, ఇదే తమ ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో శనివారం మధ్యాహ్నం లబ్ధిదారురాలు పాల్తూరు రుద్రమ్మ W/O పాల్తూరు మరిచేడప్ప ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000 రూపాయల వితంతు పెన్షన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా అందజేశారు. అనంతరం ఇందిరమ్మ కాలనీలో గ్రామస్తులతో ముచ్చటించి వారితో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటో దిగారు. తదనంతరం గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారురాలు బోయ భాగ్యమ్మ W/O బోయ ముక్కన్న ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 15 వేల రూపాయల వికలాంగుల పెన్షన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు.
ఆ తరువాత ప్రసిద్ధి గాంచిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి చేరుకుని శ్రీ ఆంజనేయస్వామి వారిని సీఎం దర్శించుకున్నారు. దేవాలయంలోని స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి ముఖ్యమంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక – పేదల సేవలో.. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
Post Views: 18