వక్ఫ్ బోర్డును (Waqf Board) రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 47ను ఉపసంహరించింది. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టినట్లు సర్కారు తెలిపింది. త్వరలోనే కొత్త వక్ఫ్ బోర్డు నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన జీవో -47 ను ఉపసంహరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 75ను విడుదల చేసిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డు ఎలెక్టెడ్ మెంబర్లు, నామినెటేడ్ మెంబర్ల ఎంపిక విషయంలో అప్పట్లోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయని చెప్పారు. దీంతో విచారణ జరిపిన కోర్టు వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎన్నికపై స్టే ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, మైనార్టీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. త్వరలోనే కొత్త వక్ఫ్ బోర్డును నియామకంపై ఉత్తర్వులు ఇవ్వనున్నట్టుగా తెలిపారు.