మావోయిస్టులకు షాక్ తగిలింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో నర్సంపేట ఏరియా కమాండర్ భద్రుతో పాటు ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు.. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిల్స్ తో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతుల వివరాలు ఇవే..
1. కుర్సం మంగు అలియాస్ భద్రు @ పాపన్న, TSCM, సెక్రటరీ యెల్లందు – నర్సంపేట AC, AK-
47 రైఫిల్.
2. ఈగోలపు మల్లయ్య @ మధు, DVCM,
కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్ ఏసీ, ఏకే-47 రైఫిల్
3. ముస్సాకి దేవల్ @ కరుణాకర్, ACM,
4. ముస్సాకి జమున, ACM,
5. జైసింగ్, పార్టీ సభ్యుడు
6.కిషోర్, పార్టీ సభ్యుడు
7.కామేష్, పార్టీ సభ్యుడు
: మొన్న లచ్చన్న…నేడు భద్రు దళం..హతం
వరుస ఎన్ కౌంటర్లు
ఇదే ములుగు జిల్లాలో వారం రోజుల క్రితం ఇద్దరు ఆదివాసీలను ఇన్ఫార్మార్ నెపంతో మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో గ్రేహౌండ్స్ బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజా ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ హతమైనట్లు తెలుస్తోంది.