Mahaa Daily Exclusive

  ఆరు అబద్దాలు 66 మోసాలు…!

Share

రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీజేపీ చార్జీషీట్ విడుదల

ఏడాదిలో చేస్తామన్నవే పేర్కొన్నామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హామీల అమలుపై రేవంత్తో చర్చకు సిద్దం

బూతులు మాట్లాడనంటే చర్చిస్తానని షరతు

హైదరాబాద్, మహా : పదేళ్ళ బీఆర్ఎస్ పాలన ఏడాది రేవంత్ రెడ్డి పాలన ఒకేలా ఉన్నాయని, ప్రశఅనించిన వారిని ఆణగదొక్కడం, తప్పుడు కేసులు బనాయించడం, బూతులపై ఎదురు తిరగడం తప్ప ప్రజలకు జరిగిన మేలేమీ లేదని బీజేపీ రాష్ట్ర అఝధ్యక్షుడు, కేంద్ర ణంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏడాది రేవంత్ పాలనపై ఆరు అబద్దాలు 66 మోసాలు పేరుతో ఆదివారం చార్జీషీట్ ను విడుదల చేసిన కిషన్ రెడ్డి ఏడాదిలో కాంగ్రెస్ చేస్తామని ప్రజలకిచ్చిన వాగ్ధానాలపై చర్చించేందుకు సిద్దమన్నారు. చర్చిస్తా కానీ సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడకుండా ఉండాలని షరతు విధించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఇంటింటికీ గ్యారంటీ కార్డు ఇచ్చారని, ఆ గ్యారంటీలను అమలు చేయకుండానే విజయోత్సవాలను నిర్వహించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అనేక ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధ్యమైందని, ఏ ఆశయ సాధన కోసం ప్రజలు పోరాడి తెలంగాణ సాధించుకున్నారో ఆ ఆశయాలకు విరుద్ధంగా పదేళ్ళ పాట బీఆర్ఎస్ పాలన సాగిందన్నారు. బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ ఏాది పాలన కూడా సాగిందన్నారు. అయిదేళ్ళ సమయం ఉందిఅప్పుడే చార్జీషీట్లా అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలైప స్పందిస్తూ మేమేం అయిదేళ్ళ హామీలను ప్రస్తావించడం లేదు కేవలం 100 రోజుల్లో చేస్తామన్న హామీలను మాత్రమే ప్రస్తావించామని బదులిచ్చారు.

ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబజడి ప్రశ్నించే అధికారం తమకుందని, ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. 2023 డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ జన్మదినం రోజున రుణ మాఫీ చేస్తానని చెప్పి ఏడాది కావస్తున్నా ఇంకా కాలేదన్నారు. రైతు భరోసాను పూర్తిగా మరిచిపోయినట్లు ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు. పండించిన ప్రతి పంటకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకే అని మాట మార్చడం రైతులను ధగా చేయడం కాదా అని ప్రశ్నించారు. లీటరు ఫాలకు రూ. 5 బోనస్ అని చెప్పి అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ పోరాటం చేసిందని, ఇప్పుడు బలవంతంగా రైతుల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అదికారంలోకి వస్తే ఉద్.ోగాల జాతర అని యువతను నమ్మించతిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క డీఎస్సీ కూడా వేయలేదన్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారన్నారు. బస్తీ పాఠశాలలు తెరుస్తామని, కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని చెప్పారని, అవి చేయకపోగా ఉన్న పాఠశాలలను మూసి వేస్తున్నారన్నారు.

ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పెద్ద నేతలు 18 ఏళ్ళు నిండిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్నారని, ఎంత మందికి ఇచ్చారో చెప్పాలన్నారు. రెండు వేల పెన్షన్ నాలుగు వేలని, ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12 వేలు, రైతు బీమా ఏమయ్యాయని ప్రశ్నించారు. కళ్యణ లక్ష్మి కింద లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఏక్కడికి పోయిందన్నారు. దళిత బంధు కింద బీఆర్ఎస్ రూ. 10 లక్షలని చెబితే కాంగ్రెస్ రూ. 12 లక్షలని చెప్పారని, ఇంతవరు ఆ పథకం ఊసెత్తడం లేదన్నారు. డబుల్ బెడ్ రూంలను ఇవ్వకపోగా హైడ్రా పేరుతో, మూసీ నవీకరణ పేరుతో ఉన్న ఇళ్ళను కూలుస్తున్నారని విరుచుకుపడ్డారు. జాబ్ క్యాలెండర్ ను అమలు చేస్తామని చెప్పినా ఏడాదిలో అమలు కాలేదని, యువత తరఫున బీజేపీ ప్రశ్నిస్తుందన్నారు. పరిశ్రమలకు బీజేపీ వ్యతిరేకం కాదన్న కిషన్ రెడ్డి రైతులతో మాట్లాడి ఒప్పించి భములు తీసుకోవాలన్నది తమ పార్చీ విధానమని స్పష్టం చేశారు.