ఢిల్లీలో కాంగ్రెస్‌కు సీట్లిచ్చేందుకు నో చెప్పిన ఆప్ అధినేత
ఇండియా కూటమి పార్టీలతో కాంగ్రెస్ సంప్రదింపులు
న్యూఢిల్లీ, మహా : అధికర ఎన్ డీఏ కూటమిని ధీటుగా ఎదుర్కునేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి ఢిల్లీలోని ఆప్ పార్టీ షాకిచ్చింది. మూడు నెలల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగాపోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయకూడదని నిర్ణయించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేశారు కానీ.. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెల్చుకోలేదు కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితి అనుకూలంగానే ఉంది. కానీ హర్యానాలో గెలిచి తీరుతామన్న నమ్మకంతో అక్కడ ఆప్ ను కాంగ్రెస్ పార్టీ కలుపుకుని వెళ్ళలేదు. ఇదే ఆప్ నేత కేద్రీవాల్ ఆగ్రహానికి కారణమైంది. హర్యానాలో తమను కలుపుకుని వెళ్ళని కాంగ్రెస్ ను ఢిల్లీలో ఎందుకు కలుపుకోవాలన్న అభిప్రాయానికి కేజ్రీవాల్ వచ్చారు. అందుకే ఢిల్లీలో ఒంటరి పోరేనని స్పష్టం చేశారు. హర్యానాలో ఆప్ ను దూరంగా ఉంచినప్పటికీ ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఆ పార్టీకి ప్రాధాన్యమిస్తూనే ఉన్నాయి. ప్రతీ శమావేశానికి ఆహ్వానిస్తుంది. అయితే హర్యానాలో తమను దూరం పెట్టిన కాంగ్రెస్ ను ఢిల్లీలో కలుపుకుని వెళ్ళేందుకు సిద్దంగా లేమని కేడ్రీవాల్ స్పష్టం చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దీర్ఘకాలంగా ఢిల్లీని కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ పరిపాలించారు. ఢిల్లీలో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. అక్కడ ఆ పార్టీకి పునాదులు దాదాపుగా కదిలిపోయాయి. కనీసం ఖాతా తెరవడం కష్టంగా మారుతోంది. గత గత రెండు ఎన్నికల్లో ఆప్ అంతకు ముందు రెండు ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేశాయి. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు చాలా మంది ఇతర పార్టీల్లో చేరిపోయారు. నాయకుల కొరత కూడా కాంగ్రెస్ ను వేధిస్తోంది. ఇప్పుడు ఆప్ తో పొత్తు పెట్టుకుందామని చేసే ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయంలో పడింది. దేశ రాజధానిలో కాంగ్రెస్ కు కనీస నాయకత్వం లేదన్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్తే పరిస్థితి ఏమిటన్న ఛర్చ ఖూడా ఆ పార్టీలో మొదలైంది. వాస్తవానికి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశ వ్యాప్తంగా దిగజారింది. ఈ నేపథ్యంలోనే పార్టీకి పునరుజ్జీవనం పోయాలన్న సంకల్పంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ్ యాత్ర లాంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో మరోసారి కాంగ్రెస్ పై చర్చకు దారి తీశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిృన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏకు, ప్ఱధానంగా బీజదేపీకి గట్టిపోటీని ఇచ్చిన కాంగ్రెస్ లోక్సభలో చెప్పుకోతగ్గ స్థానాలను సంపాదించింది. ఇదంతా బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఇండియా కూటమితోనే సాధ్యమైందన్నది అందరికీ తెలిసిందే. ఎన్డీఏను మరింత బలంగా ఢీకొట్టాలంటే ఇండియా కూటమిలోని పార్టీలను కలుపుకుని పోవాలనుకుంటున్న కాంగ్రెస్ కు ఢిల్లీలో ఆప్ పార్ట వైఖరి కొంత ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల నష్టమే ఎక్కువ జరుగుతోందని కేజ్రీవాల్ నమ్ముతున్నారు. అందుకే మొహమాటం లేకుండా పొత్తు లేదని ప్రకటించడంతో కూటమిలోని మిగతా పార్టీలతో చర్చించేందుకు కాంగ్రెస్ సన్నద్దమైంది.