- సిడ్నీ , మెల్బోర్న్ లో వేడుకలు .
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పదిహేను సంవత్సరాల క్రితం కె సి ఆర్ గారు చేపట్టిన ‘దీక్ష’ ను గుర్తుచేసుకుంటూ ఆస్ట్రేలియాలోనిసిడ్నీ , మెల్బోర్న్ బ్రిస్బేన్ నగరాల్లో బీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘కె సి ఆర్ దీక్ష దివస్’ ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ప్రసంగిస్తూ గౌరవ కె సి ఆర్ గారు ఉద్యమ మరియు దీక్ష సమయంలో చేసిన త్యాగాలను,రాష్ట్రం సిద్దించిన తరువాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని, ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరించారు.
సిడ్నీ లో వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ “తెలంగాణ ఉద్యమంలో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కె సి ఆర్ పోరాట పటిమను, అలుపెరుగని పోరాటాన్ని,గాంధీజీ మార్గాన్ని అనుసరించి శాంతియుత దీక్ష ద్వారా కేంద్రం దిగివచ్చేలా చేసి తద్వారా తెలంగాణ రాష్ట్ర సిద్ధికి అయన చేసిన కృషిని కొనియాడారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తన రాజకీయ పదవులన్నింటిని మరియు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ‘కె సి ఆర్ సచ్చుడో లేదా తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో కె సి ఆర్ గారు చేసిన దీక్ష ప్రాముఖ్యతను వివరించారు. ఉద్యమాన్ని ముందుండి నడిపి, తద్వారా 60 సంవత్సరాల తెలంగాణ కలను సాకారం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని తన భుజస్కందాలపై వేసుకొని మునుపెన్నడూ ఎరుగని విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి న కె సి ఆర్ గారి కృషిని, పట్టుదలను వివరించారు,దేశ చరిత్రలో కె సి ఆర్ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయిన తరుణంలో ఆస్ట్రేలియా జాతికి కూడా ఆయన త్యాగాన్ని పరిచయం చేయడానికే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.
ఘనం గా నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో రవి శంకర్ దుపాటి, సంగీత దుపాటి , మధు మోహన్ రావు, అజాజ్ మొహమ్మద్, వేణుగోపాల్ దూరిశెట్టి అంజిత్ పైల్ల , అవినాష్ అడ్లూరి, మస్న అరుణ్ లతో పాటు ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.