Mahaa Daily Exclusive

  ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జై షా..

Share

మహా-

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి అయినప్పటికీ, భారత క్రికెట్ దశ దిశ అన్నీ తానై నడిపిస్తున్న జై షా… ఇప్పుడు ఐసీసీ పీఠాన్ని అధిష్ఠించారు. ఐసీసీ నూతన చైర్మన్ గా ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. జై షా ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం జై షా వయసు 35 ఏళ్లు కాగా… ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా ఘనత అందుకున్నారు. అంతేకాదు, ఐసీసీ పీఠం ఎక్కిన ఐదో భారతీయుడు జై షా. ఇప్పటివరకు ఐసీసీలో భారత్ కు ప్రముఖ స్థానం దక్కుతూ వస్తోంది. గతంలో జగ్మోహన్ దాల్మియా (1997-2000), శరద్ పవార్ (2010-12) ఐసీసీ అధ్యక్షులుగా పనిచేయగా… ఎన్ శ్రీనివాసన్ (2014-15), శశాంక్ మనోహర్ (2015-2020) ఐసీసీ చైర్మన్లుగా వ్యవహరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడైన జై షా… 2009లో క్రికెట్ పాలనా వ్యవహారాల్లో తన ప్రస్థానం ప్రారంభించారు.