Mahaa Daily Exclusive

  నాగబాబుకు షాక్.. రేసులోకి క్రిష్ణయ్య..

Share

  • లెక్కలు మార్చేసిన బిజెపి

 

ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల కాగా, మూడు స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంది. దీని మీద ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి తీవ్ర కసరత్తు చేస్తోంది. నిజానికి మూడు ఎంపీ సీట్లు అంటే అందులో జనసేనకు ఒకటి దక్కుతుందని అలా మెగా బ్రదర్, జనసేన కీలక నేత నాగబాబుకు కచ్చితంగా రాజ్యసభకు వెళ్లే చాన్స్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ రోజురోజుకూ లెక్కలు మారుతున్నాయి. వైసీపీకి చెందిన ఆర్ క్రిష్ణయ్య తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం వెనక కూడా ఒక లెక్క ఉందని అంటున్నారు. ఆయన ఈసారి బీజేపీ కోటా నుంచి ఢిల్లీలో పార్లమెంట్ లో అడుగుపెట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన రాజీనామా కంటే ముందే బేజేపీ నేతలతో ఆ విధంగా అంగీకారం పొందారని అంటున్నారు. దాంతో అనూహ్యంగా క్రిష్ణయ్య రేసులోకి దూసుకుని వచ్చారు అని అంటున్నారు. అలా బీజేపీ ఏపీ కోటాలో తన సీటుని దక్కించుకుంటుందని తెలుస్తోంది. ఇక మిగిలిన రెండు సీట్లలో బీద మస్తాన్ రావు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. మధ్యలో ఆయన వైసీపీలోకి వెళ్ళి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆ పార్టీకి సీటుకు రాజీనామా చేస్తూనే టీడీపీ పెద్దలు తిరిగి తనను ఎంపీగా పంపించాలని మాట్లాడుకున్నారని అంటున్నారు. ఇక మూడోసీటు ఓసికి ఖాయమని, గల్లా జయదేవ్ తో పాటు మరో పది మంది రేసులో ఉన్నారని చెబుతున్నారు. జనసేనాని ఢిల్లీ పర్యటన సందర్భంగా అనేక ప్రతిపాదనలు వచ్చినా, చివరకు భవిష్యత్ రాజకీయ వ్యూహాల నేపథ్యంలో జనసేనకు బిజెపి మరో విడత అవకాశం ఇస్తామని చెప్పింది.

…..