- -ఢిల్లీలో ఆప్ ఒంటరి పోరు
- అరవింద్ కేజ్రీవాల్
రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆదివారం వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి ప్రకటన చేయడం వల్ల ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.
Post Views: 13