తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది సిల్క్ స్మిత (Silk Smitha).ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లో నర్తిస్తూ.. జయమాలిని(Jayamalini), జయలలిత (Jayalalitha )వంటి స్టార్ల తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. వారి కంటే ఎక్కువ పేరు దక్కించుకుంది. అయితే క్షణికా వేషంలో ఈమె తీసుకున్న నిర్ణయం ఆమె బంగారు భవిష్యత్తును నాశనం చేసిందనడంలో సందేహం లేదు. ఒకప్పుడు స్టార్ సెలబ్రిటీగా ఒక వెలుగు వెలుగుతున్న సిల్క్ స్మిత అనూహ్యంగా ఆత్మహత్య చేసుకొని, అందరిని ఆశ్చర్యపరిచింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె 1996లో.. అంటే 35 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని మరణించడంతో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది.
ప్రేమించి మోసపోయింది..
దీంతో సిల్క్ స్మిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది.. అప్పట్లో సిల్క్ స్మిత తో పాటు పలు సినిమాలు చేసిన జయమాలిని (Jayamalini)తాజాగా సిల్క్ స్మిత మరణం గురించి మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది. జయమాలిని మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పేరు, ప్రఖ్యాతలతో పాటు డబ్బు కూడా సంపాదించిన నటి సిల్క్ స్మిత మాత్రమే. షూటింగ్స్ పార్ట్ లో ఆమె నాతో ఎక్కువగా మాట్లాడేది కాదు. అయితే ఒక సినిమాలో ఒక హీరోతో కలిసి నేను, మా అక్క జ్యోతిలక్ష్మి సిల్క్ స్మిత కలసి డాన్స్ చేసాము. ఆ సమయంలోనే ఆమె నాకు తెలిసింది. ఇకపోతే మంచి ఫామ్ లో ఉన్నప్పుడే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. ఆమె జీవితంలో ఆమె చేసిన అతి పెద్ద తప్పు కూడా అదే” అంటూ జయమాలిని తెలిపింది.
సొంతవాళ్లు లేనప్పుడే మోసం చేస్తారు..
అలాగే జయమాలిని మాట్లాడుతూ.. సిల్క్ స్మిత ప్రేమ, పెళ్లి తల్లిదండ్రులకు దూరం అవ్వడం అనే విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చింది.” ప్రేమించడం తప్పు కాదు.. కానీ తల్లిదండ్రులను కాదనుకొని ప్రేమించిన వాడి కోసం రావడమే అతిపెద్ద తప్పు. ముఖ్యంగా సిల్క్ స్మిత ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మి, కన్న తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టి, అతడి కోసం వచ్చింది. కానీ అతడు ఆమెను మోసం చేశాడు. ఒకవేళ ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఆమె పక్కన ఉంటే బాధలో ఆమెకు చనిపోవాలని ఆలోచన వచ్చేది కాదు. సొంతవాళ్ళు లేనప్పుడే చాలామంది మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలా మోసానికి సిల్క్ స్మిత బలైపోయింది”. అంటూ జయమాలిని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే తల్లిదండ్రులను కాదని ప్రేమ పేరుతో ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించి, అతడు మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుందని చెప్పింది జయమాలిని. మొత్తానికైతే జయమాలిని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
సిల్క్ స్మిత బయోపిక్..
తాజాగా ‘సిల్క్ స్మిత – క్వీన్ ఆఫ్ ది సౌత్’ అనే టైటిల్ తో ఎస్ టి ఆర్ ఐ సినిమాస్ సిల్క్ స్మిత పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు.. 18 సంవత్సరాల వ్యవధిలో 450 కి పైగా చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఈమె జీవిత కథను బయోపిక్ గా తీస్తున్నారు. ఈ చిత్రానికి జయరాం దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్బి విజయ్ అమ్రిత్ రాజ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో చంద్రిక రవి (Chandrika Ravi) లీడ్రోల్ పోషిస్తుంది.. ఈ సినిమాకు సంబంధించి ఇంట్రడక్షన్ ప్రోమో ని విడుదల చేశారు. మ్యాగ్నెటిక్ లేడీ అంటూ ఆమె గురించి చెప్పిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.