Mahaa Daily Exclusive

  మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్..!

Share

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిని ఘన విజయం దిశగా నడిపించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు భారీ ట్విస్ట్ ఇచ్చేందుకు మిత్రపక్షాలు బీజేపీ, ఎన్సీపీ సిద్ధమయ్యాయి. గతంలో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న శివసేనను చీల్చి ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించిన బీజేపీ.. ఇప్పుడు మహారాష్ట్రలో తాజా ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా ఎన్నికవడంతో తానే పగ్గాలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో షిండేకు షాక్ తప్పలేదు.

 

ఎలాగో తాను సీఎం కాకుండా డిప్యూటీ సీఎం లేదా మరో పదవి తీసుకోక తప్పని పరిస్ధితుల్లో ఏక్ నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన స్ధానంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని తేలిపోవడంతో షిండే అధికారానికి దూరంగా ఉండాలని నిర్ణయించారని సమాచారం. దీంతో ఏక్‌నాథ్ షిండేకు ప్రతిపక్ష నేతగా నియమించేలా బీజేపీ, ఎన్సీపీలు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

 

 

ఎలాగో ఆయన డిప్యూటీ సీఎం పదవి తీసుకోవట్లేదు కాబట్టి విపక్ష మహావికాస్ అఘాడీ కంటే ఎక్కువ సీట్లు వచ్చిన శివసేన నేతగా షిండేకు విపక్ష నేత ఇచ్చి గౌరవించాలని మహాయుతి కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలో మహాయుతి ఇద్దరు భాగస్వాములు, విపక్షంలో శివసేన ఉంటే ఇక విపక్షం అనేది లేకుండా పోతుందని వీరు అంచనా వేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ఆయన అనుచరులతో బీజేపీ, ఎన్సీపీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి తర్వాత ప్రతిపక్ష నాయకుడి పదవి రెండవ స్థానంలో ఉంటుందనే లాజిక్ ను వీరు తెరపైకి తెస్తున్నారు.