Mahaa Daily Exclusive

  మంగళగిరిలో వీరమల్లు..!

Share

  • ఇన్ స్టాలో పవన్ సెల్ఫీ
  • 2025 మార్చి 28న మూవీ రిలీజ్

మహా

రాజ‌కీయాల్లో పూర్తిగా బిజీ అయిన పవన్ కల్యాణ్ ప్ర‌స్తుతం కొంత‌ గ్యాప్ దొర‌క‌డంతో ‘హరిహర వీరమల్లు’ సినిమా పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు. ప్రస్తుతం ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ షూటింగ్ మంగళగిరిలో వేసిన ఓ సెట్‌లో జ‌రుగుతోంది. దీనిలో భాగంగా మేక‌ర్స్‌ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. తాజాగా పవన్ ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ‘హరిహర వీరమల్లు’ సెట్స్ లో దిగిన సెల్ఫీని త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు.