Mahaa Daily Exclusive

  జర్నలిస్టులకు సద్దుల బతుకమ్మ, దసరా కానుకగా రూ.10వేలు

Share

  • వరంగల్ తూర్పు జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు కోరుకొప్పుల నరేందర్

వరంగల్, మహా ;

వరంగల్ తూర్పు జర్నలిస్ట్ పరపతి సంఘం సబ్యులు వారి కుటుంబాలతో సద్దుల బతుకమ్మ, దసరా పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకునేందుకు.. పండుగ కానుకగా ప్రతీ సభ్యుడికి రూ.10000 వేల రూపాయల చొప్పున వంద మంది సభ్యులకు 1000000 లక్షల రూపాయలను అందజేయడం జరిగింది.

ప్రస్తుత కరువు పరిస్థితుల్లో పండుగ జరుపుకోవడం కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కొందరు సభ్యులు మా దృష్టి కి తీసుకురావడం జరిగింది. సబ్యులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యం తో ..- ఇలాంటి సమయం లోనే సబ్యులకు సంఘం భరోసా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో… పండగ కానుకగా పది వేల రూపాయల చొప్పున అందరికీ అందజేయడం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమం సంఘం అధ్యక్షుడిగా నా నేతృత్వంలో జరుగడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా సభ్యులందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు.