తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్ ఏడాది పాలన పూర్తయ్యే క్రమంలో.. నూతన శకానికి నాంది పలికింది. ఏకంగా గూగుల్ సంస్థతో ఒప్పందాన్ని ఏర్పరచుకొని, హైదరాబాద్ నగరం వైపు ప్రపంచం చూసేలా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం గూగుల్ సీఐఓ రాయల్ హాన్సెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటుచేసే పలు సంస్థల గురించి వారిద్దరి మధ్య చర్చలు సాగాయి. దీనితో తెలంగాణలో భారీ పెట్టుబడులకు గూగుల్ సిద్దమైంది.
హైదరాబాద్ లో భారతదేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను స్థాపించేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డిని గూగుల్ సీఐఓ కలిశారు. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో టోక్యో తర్వాత ఏర్పాటు చేసే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్ లో స్థాపించడం గమనార్హం. ఈ సెంటర్ అధునాతన భద్రత, ఆన్లైన్ భద్రత ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇటీవల యూఎస్ఏ లోని గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించిన సందర్భంగా అక్కడ గూగుల్ సమస్త ప్రతినిధులతో పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. హైదరాబాద్ నగరంలో జిఎస్ఈసిని ఏర్పాటు చేసేందుకు, గూగుల్ ముందుకు రావడం తనకు గర్వంగా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. యావత్ భారత్ లోనే హైదరాబాద్ నగరం ఐటీ మరియు ఇన్నోవేషన్ హబ్ గా నిలుస్తుందనడానికి గూగుల్ తో గల తమ భాగస్వామ్యం నిదర్శనమన్నారు. డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ ఎప్పుడు ముందులో ఉంటుందని, ఇప్పటికే అత్యంత విలువైన ఐదు టెక్స్ కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నాయన్నారు.
గూగుల్ తో జరిగిన ఒప్పందంతో డిజిటల్ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు అవకాశం ఉంటుందని, సైబర్ సెక్యూరిటీ కార్యక్రమాలలో హైదరాబాద్ అగ్రగామిగా నిలుస్తుందని సీఎం రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా హాన్సెన్ మాట్లాడుతూ.. డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ ముందంజలో ఉందని అన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఐటీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. ఇప్పటికే ప్రపంచంలో పేరొందిన అయిదు టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు సేఫ్టీ సెంటర్ ద్వారా స్థాయిలో సైబర్ సేఫ్టీ సమస్యలను వేగంఆ పరిష్కరించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు.
ఈ సెంటర్ ఏర్పాటుతో వేల సంఖ్యోల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. గూగుల్ మేనేజ్‌మెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా ఒప్పించిన రేవంత్ సర్కార్ కు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు గూగుల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.