Mahaa Daily Exclusive

  కాకినాడ పోర్టు పై సీఐడీ ఎంక్వైరీ..? అసలు ఏం జరిగింది..?

Share

జగన్ పాలనలో జరిగిన అరాచకాలు బయటకు వస్తున్నాయా ? కాకినాడ సీ పోర్టు విషయంలో జగన్ కొంప కొల్లేరు అవుతుందా? మాజీ సీఎం చుట్టూ ఉచ్చు బిగిసుకున్నట్టేనా? అప్పటి పోర్టు ఓనర్ జీవీరావు నుంచి బలవంతంగా పోర్టుని లాక్కున్నారా? ఇక జగన్ పని అయిపోయినట్టేనా అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

అసలు జీవీరావు నుంచి పోర్టు తీసుకోవడం వెనుక ఏం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే… కాకినాడ పోర్టులో రైస్ పట్టుబడింది. ఆ తర్వాత జీవీరావు పేరు బలంగా వినిపిస్తోంది. ఇంతకీ జీవీరావు అలియాస్ కర్నాటి వెంకటేశ్వరారావు ఎవరు? కాకినాడ సీ పోర్టు మాజీ యజమాని.

 

కాకినాడు పోర్టుకు సంబంధించి 1999లో ప్రభుత్వంతో ఓ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత పోర్టు నిర్మాణం మొదలైంది. కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ పేరు మీద నడిచింది. ఈ మొత్తానికి కేవీరావు దగ్గరుండి చూసుకున్నారు. భూమి సేకరణ, నిర్మాణం వరకు అన్నీ తానై నడిపారు. కాకినాడ సీ పోర్టుకు సంబంధించి 2001 నుంచి 2019 వరకు ఎలాంటి సమస్య రాలేదు.

 

టీడీపీ అధినేత చంద్రబాబుకు జీవీ రావు సన్నిహితంగా ఉంటారన్న అనుమానం వైసీపీ నేతలకు వచ్చింది. కాకినాడ సీ పోర్టు అంశంలో కేవీరావు-శరత్ చంద్రారెడ్డి మధ్య ఎలాంటి వివాదాలు లేవు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే కాకినాడ పోర్టులో జరిగిన లావాదేవీలపై విచారణకు ఆదేశించింది.

 

స్పెషల్ ఆడిట్ పేరుతో ఫాల్స్ క్లయిమ్ చేసినట్టు ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో జీవీరావుకు 1,000 కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది అప్పటి వైసీపీ సర్కార్. అరెస్ట్ వారెంట్లు ఇష్యూతోపాటు ఆస్తుల జప్తు, పోర్టు స్వాధీనమంటూ అధికారం యంత్రాంగాన్ని మొహరించింది. ఇలా రకరకాలుగా కేవీరావు ఫ్యామిలీని బెదిరించారు అప్పటి వైసీపీ పాలకులు.

 

కాకినాడ సీ పోర్టును అరబిందోకు రాసి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారట అప్పటి పాలకులు. అందుకు జీవీరావు సనేమిరా అనడడంతో ఓ రేంజ్‌లో టార్చర్ చేశారట. చివరకు రాత్రికి రాత్రి సంతకాలు చేయించుకుని మెడ పట్టుకుని బయటకు గెంతేశారు. పోర్టు విషయంలో ఆయన దగ్గరున్న 41 శాతం షేర్లను బలవంతంగా తీసుకున్నారట.

 

షేర్లను జీవీరావు అమ్మిన సందర్భం ఎక్కడా రాలేదు. పోర్టుకు సంబంధించి దాదాపు 2 కోట్ల 15 లక్షల షేర్లు ఉన్నాయి. మార్కెట్లో వాటి విలువ అక్షరాలా 1600 కోట్ల రూపాయలన్నమాట. ఒక్కమాటలో చెప్పాలంటే కాకినాడ సీ పోర్టును ఆయన నుంచి బలవంతంగా లాక్కున్నట్లు తెలుస్తోంది.

 

జీవీ రావు నుంచి పోర్టు కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో ఎక్కడా కనిపించలేదు. కాకపోతే షేర్లు మాత్రం టాన్స్‌ఫర్ అయినట్టు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వేసిన 1000 కోట్ల పెనాల్టీ చివరకు 10 కోట్లకు చేరింది. ఆ మొత్తాన్ని అరబిందో కంపెనీ చెల్లిందా లేదా అనేది తెలీదు.

 

కాకినాడ సీ పోర్టు విషయంలో మరో రెండు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 75 కిలోమీటర్లు పరిధిలో రెండు పోర్టులు ఒకరి చేతిలో ఉండకూడదనేది చట్టం చెబుతోంది. దాన్ని రద్దు చేసి సీ పోర్టును అరబిందోకు అప్పగించినట్టు కనిపిస్తోంది.

 

ఇదిలావుంటే కాకినాడ సీ పోర్టుకు దగ్గరలో మరొకటి ఉంది. కాకినాడ గేట్ వే పోర్టు ఉండేది. దాన్ని జీఎంఆర్ నిర్వహించేది. దీని పేరిట 1500 ఎకరాలు భూములు ఉండేవి. అలాగే కాకినాడ సెజ్ పేరిట 5600 ఎకరాలు ఉండేవి. కాకినాడ గేట్ వే పోర్టు, కాకినాడ సెజ్‌లను అరబిందో కొనుగోలు చేసింది. మూడింటిని అరవిందో కంపెనీకి వచ్చేలా అప్పటి వైసీపీ సర్కార్ పావులు కదిపింది.

 

కాకినాడ సీ పోర్టు విషయంలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. సీ పోర్టులో 41 శాతం వాటాను అరబిందో దక్కించుకోవడంపై సీఐడీకి ఫిర్యాదు చేసింది కాకినాడ పోర్టు యాజమాన్యం. వెంటనే చంద్రబాబు కేబినేట్ ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించడం చకచకా జరిగిపోయింది. పోర్టు మార్పిడి వ్యవహారంలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.