Mahaa Daily Exclusive

  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటరు నమోదు ఫారాలను పంపిణీ చేసిన ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR)!

Share

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ డివిజన్‌లోని వివేకానంద హై స్కూల్, పెర్సీస్ హై స్కూల్‌లో అధ్యాపకులకు పట్టభద్రుల ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా MGR మాట్లాడుతూ.. అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునేలా అధ్యాపకులు చొరవ తీసుకోవాలని కోరారు. ఓటరు నమోదు ప్రాధాన్యతపై తోటి అధ్యాపకులకు, అర్హులైన పట్టభద్రులకు అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

పట్టభద్రుల ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని MGR విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నరసింహ ముదిరాజ్, వెంకటేష్, ఉమా, ధనరాజ్, శశిరాజ్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.