అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి రూమర్లు.
* వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఇన్విటేషన్ బాక్స్.
* నవంబర్ 21న చెన్నైలో రిసెప్షన్!
హైదరాబాద్, మహా.
సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్, స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కో-ఓనర్ కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరి వివాహం గ్రీస్ దేశంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఈ జంట గానీ, వారి కుటుంబ సభ్యులు గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే వేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నవంబర్ 21న చెన్నై వేదికగా జరగనున్న రిసెప్షన్ ఈవెంట్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రికలు (వెడ్డింగ్ ఇన్విటేషన్స్) ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండటం సర్వత్ర చర్చనీయాంశమైంది.
అద్భుతమైన డిజైన్‌తో ఆకట్టుకుంటున్న ఇన్విటేషన్ బాక్స్
ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఇన్విటేషన్ బాక్స్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అత్యంత విలాసవంతంగా, కళాత్మకంగా తీర్చిదిద్దిన ఈ ఆహ్వాన బాక్స్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఇన్విటేషన్ బాక్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐవరీ (దంతపు) రంగు బాక్స్‌పై వేసిన లేత నీలి రంగు ఎంబ్రాయిడరీ డిజైన్ చూపు తిప్పుకోనీయకుండా అత్యంత ఆకర్షణీయంగా ఉందని అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. బాక్స్‌పై ఉన్న ఎంబ్రాజ్డ్ (ఉబ్బినట్లు ఉండే) అక్షరాలు, పాతకాలపు రాజసం ఉట్టిపడే వింటేజ్ లుక్స్ ఉన్న సీల్ ఈ ఆహ్వాన పత్రికకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అధికారిక ప్రకటన లేకపోయినా, ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ బాక్స్ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ ట్రెండింగ్ టాపిక్ ప్రస్తుతం సినిమా, క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 21న చెన్నైలో జరగనున్న ఈ రిసెప్షన్‌కు సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై అనిరుధ్ లేదా కావ్య మారన్ కుటుంబాల నుంచి అధికారిక స్పందన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.








