Mahaa Daily Exclusive

  ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ ప్రస్థానంపై పుస్తకావిష్కరణ…

Share

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ ప్రస్థానంపై పుస్తకావిష్కరణ.
* డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డితో ఐసీపీఆర్‌డీ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ భేటీ.
* ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనే ధ్యేయంగా దేశ ప్రగతిపై ప్రత్యేక చర్చ
న్యూఢిల్లీ, మహా.

భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పార్టీ మాజీ కో-ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డిని న్యూఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాంప్రహెన్సివ్ పాలసీ అండ్‌ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అధ్యక్షుడు శ్రీ కె.ఆర్‌. రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ శైలి, ఆయన రాజకీయ ప్రయాణం, దేశంలో తీసుకువచ్చిన సుపరిపాలన సంస్కరణల విశేషాలతో శ్రీ కె.ఆర్‌. రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ స్వయంగా రచించిన ఒక ప్రత్యేక పుస్తకాన్ని డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డికి అందజేశారు.
ఈ సమావేశంలో భారతదేశ అభివృద్ధి గమనం, ప్రజా విధానాలు (పబ్లిక్ పాలసీ), నాయకత్వ లక్షణాలు, దేశ భవిష్యత్తు ఆకాంక్షలపై ఇరువురు ప్రముఖులు విస్తృతంగా అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానంగా 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన, స్వయంసమృద్ధి గల భారత్‌గా మార్చాలనే ‘వికసిత్ భారత్ 2047’ స్వప్నం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్న అంకితభావాన్ని ఈ భేటీ ప్రతిబింబించింది.
భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు, చారిత్రాత్మక నిర్ణయాలు, పరివర్తనాత్మక కార్యక్రమాలను పుస్తకాల రూపంలో డాక్యుమెంట్ చేయడం ఎంతైనా అభినందనీయమని డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు. దేశ ప్రగతి కోసం మేధోపరమైన చర్చలు, నిర్మాణాత్మక సంభాషణలు, సమిష్టి కృషితో ముందుకు సాగాల్సిన ప్రాముఖ్యతను ఈ సమావేశం మరోసారి నొక్కిచెప్పింది.