జిల్లాలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖ మరియు జిల్లా ఇన్ చార్జి మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి అన్నారు.
గురువారం వేమూరు నియోజక వర్గoలోని జంపని గ్రామంలోని వరి కల్లాలను రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు.
ఈసందర్భంగా జిల్లా ఇన్ ఛార్జి మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 15 వేల ఎకరాలలో వరి పంటలు సాగు చేశారని ఇప్పటివరకు 9వేల ఎకరాల్లో వరి కోతలు జరిగాయని 25 వేల టన్నుల ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేయడం జరిగిందని ఆయన చెప్పారు.
జిల్లాలో వరి పండించిన రైతులందరూ రైతు సేవ కేంద్రం ద్వారా ధాన్యాన్ని అమ్మకాలు చేసుకోవాలని ఆయన చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం మద్దతు ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్మకాలు సాగించాలని ఆయన సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులుఆందోళన చెందనవసరం లేదని ఆయన అన్నారు. రైతు సేవా కేంద్రాలలో అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు తేమ శాతాన్ని నిర్ధారించి కొనుగోలుచేయాలని ఆయన చెప్పారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆరు గంటల సమయంలోగా రైస్ మిల్లులకు తరలించాలని ఆయన చెప్పారు.
రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోగా రైతుల ఖాతాలకు నగదు జమ చేయడం జరుగుతుందని అని చెప్పారు. రైతులు పండించిన వరి ధాన్యం తేమశాతం 17 వరకు ఎలాంటి కోతలు ఉండవని ఆయన అన్నారు. తేమశాతం 22 శాతంపైన ఉన్నట్లయితే క్వింటాకు 5 కేజీలు కేజీలు మినహాయింపు ఉంటుందని ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వం రైతులకు ఉన్న బకాయిలను 1640 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం రైతులకు జమ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. అనంతరం రాష్ట్ర సమాచారపౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొల్లూరు మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు.
రైతు సేవా కేంద్రాలలో వ్యవసాయ శాఖ అధికారులు రైస్ మిల్లర్ల ప్రతినిధులు ధాన్యము తేమ శాతాన్ని కొలిచి ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని వారు సూచించారు. ధాన్యాన్ని నిర్దిష్ట సమయంలోగా లారీలను రైస్ మిల్లులకు రవాణా చేయాలని వారు చెప్పారు. అక్కడికి వచ్చిన రైతులతో వారు మాట్లాడి ఏమైనా సమస్యలు ఉంటే రైతుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకెళ్తామని మంత్రులు చెప్పారు. అనంతరం కొల్లూరు మండల కేంద్రంలోని రైస్ మిల్లును రాష్ట్ర మంత్రులు సందర్శించారు.
రైస్ మిల్లులో ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం కొల్లూరు గ్రామ శివారులోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద నిర్మించిన గృహ నిర్మాణ లేఔట్ ను మంత్రులు పరిశీలించారు. గృహనిర్మాణ లేఔట్ లో స్థానికులు ప్రజలు రోడ్డు సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కావాలని మంత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసన సభ్యులు నక్క ఆనందబాబు, జాయింట్ కలెక్టర్ ప్రకఖర్ జైన్, జిల్లావ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి విలియమ్స్, రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి, వేమూరు తాసిల్దార్ సుశీల, కొల్లూరు తాసిల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 28