బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. రెండు షూరిటీలతో పాటు రూ. 5వేల జరిమానాతో కౌశిక్ రెడ్డికి న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. బంజారాహిల్స్ పీఎస్‌లో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డితో పాటు ఆయన 20 మంది అనుచరులపై కేసు నమోదైంది.
కాగా, బుధవారం తన ఫోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పీఎస్‌కు వెళ్లారు. అయితే, ఆయన వెళ్లేసరికి ఏసీపీ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి హంగామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. ఆ తర్వాత గురువారం ఆయనను అరెస్ట్ చేశారు.
Post Views: 26