Mahaa Daily Exclusive

  పుష్పరాజ్ రికార్డుల మోత..

Share

  • మొదటిరోజే ఇండియన్ బాక్సాఫీస్ షేక్
  •  రూ.294కోట్ల గ్రాస్ తో రాజమౌళి రికార్డులు బద్దలు
  •  రేవతి కుటుంబానికి రూ.25లక్షల సాయం ప్రకటించిన అల్లుఅర్జున్

 

థియేటర్లలో గంగమ్మ జాతర, బయట కలెక్షన్ల జాతర అన్నట్లుగా ‘పుష్ప 2’ సినిమా ప్రభంజనం ఉంది. తాజాగా మూవీ టీమ్ డే 1 కలెక్షన్ల వివరాలను తెలియజేశారు. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులు బద్దలవడమే కాకుండా.. సరికొత్త రికార్డులను పుష్పరాజ్ బాక్సాఫీస్‌‌కి పరిచయం చేశాడు. ఈ సినిమా ఫస్ట్ డే ఇండియన్ సినిమా హిస్టరీలో ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టి.. ఆల్ టైమ్ రికార్డ్‌ని క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ డే కలెక్షన్లతో పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రకారం ఈ సినిమా రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టి.. ఇండియన్ సినిమా డే 1 హిస్టరీలో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డును బాక్సాఫీస్ వద్ద నెలకొల్పింది. ఇంతకు ముందు ఉన్న ఆర్ఆర్ఆర్ డే 1 రికార్డ్ రూ. 233 కోట్ల గ్రాస్. పుష్పరాజ్ డే 1 సెట్ చేసిన రికార్డ్ రూ. 294 కోట్ల గ్రాస్. నైజాం, హిందీ బెల్ట్‌లో కూడా ‘పుష్పరాజ్’ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. నైజాంలో ఇప్పటి వరకు ఉన్న ఆర్ఆర్ఆర్ రూ. 23 కోట్ల రికార్డును రూ. 30 కోట్లు రాబట్టి మరో హిస్టరీని నెలకొల్పాడు పుష్ప. మరోవైపు తొక్కిసలాటలో చనిపోయిన అల్లుఅర్జున్ అభిమాని రేవతి కుటుంబానికి రూ.25లక్షల సాయాన్ని అల్లుఅర్జున్ ప్రకటించారు. జరిగిన సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

….