Mahaa Daily Exclusive

  రాష్ట్ర పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు

Share

రాష్ట్ర పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు
నాలుగు విభాగాల్లో అవార్డులు
అవార్డులు పొందిన పంచాయతీలకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు అభినందనలు
కేంద్ర ప్రభుత్వం అందించే ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్’ అవార్డుల్లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి నాలుగు పంచాయతీలు అగ్ర స్థానంలో నిలిచి పురస్కారాలు కైవసం చేసుకున్నాయి. హెల్దీ పంచాయత్ అనే విభాగంలో చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రం, వాటర్ సఫిషియెంట్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడి, క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని తగరంపూడి, సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ పంచాయతీలు అవార్డులు పొందాయి.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పురస్కారాలు పొందిన పంచాయతీలకు అభినందనలు తెలిపారు. “రాష్ట్ర పంచాయతీలకు పంచాయతీల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీలు సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. పురస్కారాలు సాధించి గొప్ప విజయాన్ని పొందిన పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికీ అభినందనలు. క్షేత్ర స్థాయిలో స్థానిక సంస్థల పాలనను బలోపేతం చేసి సుస్థిర అభివృద్ధి సాధనకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా మన రాష్ట్ర గ్రామ పంచాయతీలు దృఢ చిత్తంతో, అంకిత భావంతో పని చేస్తున్నాయి” అన్నారు.