Mahaa Daily Exclusive

  తెలంగాణలో మళ్లీ భూకంపం …!

Share

మొన్నటికి మొన్న భూకంపం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ప్రజలను భయాందోళనలకు తీవ్ర గురి చేసింది. ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టేలా చేసింది. జనం చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపాల్సి వచ్చింది. కంపించింది కొన్ని సెకెన్ల పాటే అయినప్పటికీ దాని ప్రభావం జనంపై తీవ్రంగా పడింది. ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు.

తెలంగాణలోని ములుగు జిల్లాలో భూకంప తీవ్రత అధికంగా కనిపించింది. రిక్టర్ స్కేలు‌పై 5.3గా రికార్డయింది. ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది. అదే సమమయంలో ఏపీ, తెలంగాణల్లో ఈ భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని చోట్ల రెండు సెకెన్ల పాటు భూమి ప్రకంపించింది.