Mahaa Daily Exclusive

  కేసీఆర్‌ ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

Share

ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి(telangana Thalli) విగ్రహావిష్కరణకు రావాలని బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌(KCR)ను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Ponnam Prabhakar) ఆహ్వానించారు. ముందుగా కేసీఆర్‌ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లి‌లోని కేసీఆర్ నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బృందాన్ని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్(Joginapally Santosh Kumar), మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంశీధర్ రావులు స్వాగతం పలికారు.