తెలంగాణపై ప్రేమ ఉంటే
కేసీఆర్, కిషన్ రెడ్డి వస్తారు
వస్తే.. పోయేదేముంది.. రండి
తెలంగాణ తల్లిరూపం మంచివిగ్రహం వచ్చింది
విగ్రహావిష్కరణకు రావడం వారి విజ్ఞత
బిజెపి బిఆర్ఎస్ పై ఛార్జిషీట్ వేయాలి
ఎఎన్ఎన్- మహా తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, మహా :
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్, కిషన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నామని, తాను మళ్ళీ ఆహ్వానం పలుకుతున్నా రావాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఎఎన్ఎన్-మహా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ వివరాలు
మహా- బిఆర్ఎస్ పార్టీ ఏడాదిపాలనమీద ఛార్జిషీట్ విడుదల చేసింది. ఎలా చూస్తారు?
మంత్రి- పదేళ్లు పాలనను గాలికి వదిలేసి ప్రజా పాలన కొనసాగిస్తున్న మా ప్రభుత్వంపై చార్జి షీట్ వేయడమేంటి. ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని 11 ఏళ్ల నుండి మోసం చేస్తున్న బీజేపీపై వేయాలి చార్జిషీట్, దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం ఇలా ఎన్నో చెప్పిన బీఆర్ఎస్ అప్పుడెందుకు వేయలేదు చార్జిషీట్ . ప్రధానమంత్రి అందరి అకౌంట్లలో 15లక్షలు వేస్తా అన్నడు. 2కోట్ల ఉద్యోగాలు అన్నడు. ఎవరిమీద ఛార్జిషీట్ వేయాలి. ఎంతమందికి 15లక్షలు వేయాల్సి ఉంది. నీ పాలనలో అదానీ అంబానీ తప్ప ఎవరు బాగుపడ్డరు. మేం 8 నెలలు అధికారంలో ఉన్నం. ఇప్పటికే చాలా చేసినం. ఇంకా చాలా చేస్తం. మరో తొమ్మిదేళ్లు అధికారంలో ఉంటాం.
మహా- తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ వస్తారా?
మంత్రి- రమ్మని ఆహ్వానించాం. కేసీఆర్, కిషన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నం. తెలంగాణ మీద ప్రేమ ఉంటే వస్తరు. రావడం రాకపోవడం వారి విజ్ఞత. వస్తే పోయేదేం లేదు. రండి. మంచి విగ్రహం. మా ఆర్ అండ్ బి శాఖ ద్వారా దీనిని ఏర్పాటుచేసే అవకాశం లభించింది. మంచి ఆర్కిటెక్ట్ తో మంచి విగ్రహం చేయించినం. రాకపోతే మిస్ అయితరు. లక్షలమంది వచ్చి చూస్తరు. అమరవీరులకు నివాళులు అర్పించండి. విగ్రహం చూడండి.
మహా- బండిసంజయ్, కిషన్ రెడ్డి రావడం లేదని చెప్పారు?
మంత్రి- తెలంగాణ మీద ప్రేముంటే రావాలి. ఆరోజు కిషన్ రెడ్డి, యెండల ఎమ్మెల్యేలుగా ఉంటే యెండల రాజీనామా చేసిండు. కిషన్ రెడ్డి చేయలేదు. నేను తెలంగాణ రాష్ట్రంలోనే తీసుకుంటా అని మా ప్రభుత్వం వచ్చేదాకా తీసుకోలే. శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకుంటే , కేసిఆర్ మాత్రం ఎట్ల బయటపడ్డరో ప్రజలందరికి తెలుసు . హరీష్ రావు, కేటీఆర్ ది రాజకీయ ఉనికి పోరాటం తప్పా.. నిజమైన ప్రతిపక్ష పాత్ర కాదు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రజాపాలనపై చార్జ్ షీట్ వేసేంత నైతికత లేదు. దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం.. ఒక్కటి కాదు వందసార్లు తలనరుక్కుంటా అన్న కేసిఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ కు పరిమితమాయ్యారు.