- ప్రభాస్ పంపిన బాహుబలి భోజనం బకాసురుడిలా తిని, కుంభకర్ణుడిలా పడుకున్నా’
- వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ వీడియో షేర్ చేసిన జగపతిబాబు
- – భీమవరంలో షూటింగ్ జరుగుతుండగా భోజనం పంపిన రెబల్ స్టార్
మహా-
రెబల్ స్టార్ ప్రభాస్ నటినటులకు భోజనం పంపిస్తాడని కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవల్లో ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. తాజాగా ఆ లిస్ట్లో నటుడు జగపతి బాబు కూడా చేరిపోయారు. తాజాగా ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. అందులో చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటిని బకాసురుడిలా తిని, కుంభకర్ణుడిలా పడుకున్నానంటూ జగపతి బాబు హస్యస్పదంగా తెలిపారు.
ప్రభాస్ ఫుడ్తో ఈ బాబు బలి
ఆ వీడియోలో ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు, వియ్యాలవారి విందు ఓ హో హో నాకే ముందు’ అంటూ ఆ వాతావరణానికి సెట్ అయ్యేలా పాటను యాడ్ చేశారు. అంతే కాకుండా ప్రభాస్ గురించి కొన్ని ఫన్నీ కామెంట్స్ను రాసుకొచ్చారు. ఇది ప్రభాస్ ప్రమేయం లేకుండా జరిగిందని, దీని గురించి చెప్పొద్దని అన్నారు. ఎందుకంటే ఎవరైనా చెప్తే తను పెట్టే ఫుడ్తో ఈ బాబు బలి అంటూ సరదాగా వ్యాఖ్యల్నీ జోడించారు. అదీ బాహుబలి లెవల్ అంటూ ప్రశంసించారు.
భీమవరం రాజులకు జై
భీమవరం రాజులను స్టైల్ను జగపతి బాబు గుర్తు చేసుకున్నారు. రాజులు పెట్టిన భోజనం తిన్నాక వారిని కొనియాడకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి. జై భీమవరం, జై రాజులు, జై బాహుబలి, జై ప్రభాస్ అంటూ జగపతి బాబు మురిసిపోయారు. ఇంతకీ ఆయన భీమవరం ఎందుకు ఉన్నారంటారా? ఓ మూవీ షూటింగ్ కోసం అని చెప్పారు. ప్రభాస్తో కలిసి జగపతి బాబు చేసిన సలార్ బాక్స్ఆఫీస్ను షేక్ చేసింది. సలార్ సినిమాలో జగపతి బాబు వరదరాజు రాజమన్నార్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు.