- సెట్‌లో పవన్ కల్యాణ్, జ్యోతికృష్ణ
టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఈ స్టార్ యాక్టర్ ఖాతాలో ఓజీ, హరిహరవీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయని తెలిసిందే. కాగా ప్రస్తుతం ఓ వైపు ఓజీ షూట్‌లోనే పాల్గొంటూనే.. మరోవైపు హరిహరవీరమల్లు చిత్రీకరణలో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే ఓజీ షూట్ థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో కొనసాగుతుందని తెలిసిందే. తాజాగా హరిహరవీరమల్లు సెట్‌లో షూటింగ్ మూడ్‌లో ఉన్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. డైరెక్టర్ సీన్ వివరిస్తుండగా.. పవన్ కల్యాణ్ స్క్రిప్ట్ చదువుకుంటుండటం చూడొచ్చు. హరిహరవీరమల్లు ఫైనల్ షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్ అంటూ ఖడ్గాలు, స్టార్ ఎమోజీలను పోస్ట్ చేశారు మేకర్స్. ఇప్పుడీ స్టిల్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.
జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో పీరియాడిక్ డ్రామా ఫొటో షూట్ కోసం ఇటీవలే భారతీయ తొలి పొటోమెట్రిక్ 3 డీ స్కానింగ్ టెక్నాలజీ వినియోగించారని తెలిసిందే. ఈ మూవీలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీ రెండు పార్టులుగా వస్తుండగా.. పార్ట్ 1ను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.