సర్కారు
సూపర్ హిట్
-ముఖ్యమంత్రిగా రేవంత్ కు మంచి మార్కులు
– ప్రజా విజయోత్సవాల వ్యూహం సక్సెస్
– చేసింది చెప్పుకున్న ప్రభుత్వం
– మహిళల్లో సీఎంపై పెరిగిన అభిమానం.. యువతలో క్రేజ్
9వేల శాంపిల్స్ తో ఎఎన్ఎన్ – మహా సంచలన సర్వే
(హైదరాబాద్-మహా)
ఈ సర్కారు సూపర్ హిట్ అంటున్నారు పబ్లిక్. ఆయనే రావాలి అన్న మాటలు.. పోయి ఈయనే ఉండాలి అన్నట్లుగా గత పక్షం రోజుల రాష్ట్ర రాజకీయ వాతావరణం మారిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహ చాతుర్యంతో ప్రజా ప్రభుత్వం ట్యాగ్ లైన్ కు తగ్గట్లుగా ప్రజాభిమానం పెంపొందించుకుంది. ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభమైనపుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి గానీ, ముఖ్యమంత్రికి గానీ ఏకపక్ష సానుకూల వాతావరణం లేకపోగా.. అక్కడక్కడా సణుగుడు, గొణుగుడు ధ్వనులు వినిపించాయి. కానీ గత పక్షంరోజుల రాజకీయ చాతుర్యంతో రేవంత్ వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసి ఏకపక్షం చేసేశారు. సరైనోడు అనిపించుకున్నారు. ప్రజా విజయోత్సవాల వ్యూహం సక్సెస్ కాగా, మంత్రులను, ప్రజాప్రతినిధులను ప్రజలకు దగ్గర చేసి.. మీడియాకు ఇంటర్వ్యూలు, విశ్లేషణలు విరివిగా అందజేసి తక్కువకాలంలో ఎక్కువ పనులు చేసిన ప్రభుత్వంగా ప్రచారం చేసుకుంది. తాజా విజయోత్సవాలతో మహిళల్లో ముఖ్యమంత్రి పట్ల అభిమానం పెరగ్గా, యువతలో క్రేజ్ కొనసాగుతోంది.
రేవంత్ పాలన బాగుందన్న 73శాతం మంది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటూ ఎఎన్ఎన్ ఛానల్ – మహా పత్రిక జనాభిప్రాయం కోరగా, 9వేలమంది తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఇందులో ముఖ్యమంత్రి పరిపాలన సూపర్ అంటూ 75శాతం కు పైగా రేటింగ్ ఇచ్చినవారు 54శాతం మంది. కాగా సీఎంగా రేవంత్ పాస్ అన్నవారు మరో 19శాతం. ఫెయిల్ అన్నవారు 27శాతం మంది. దీంతో మొత్తంగా సీఎం పరిపాలన బాగుందన్న వారు 73శాతం మంది కాగా, బాగాలేదన్న వారు 27శాతంకు పరిమితమయ్యారు. గత నెలతో పోలిస్తే సీఎం గ్రాఫ్ ఇపుడు బాగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వేలకోట్ల పనులు చేపట్టడంతో పాటు భవిష్యత్తుపై ఆశలు కల్పించడంలో సీఎం సక్సెస్ అయ్యారు. జోరుగా నిర్వహించిన ప్రచారం కూడా అపోహలు తొలగించింది.
పథకాల్లో మేటి అదే
ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదికాలంలో చేపట్టిన కార్యక్రమాల్లో మీరు దేనికి అత్యధిక మార్కులు వేస్తారు అంటూ అత్యధికులు ఉద్యోగ నియామకాలకే వేశారు. 55,142 ఉద్యోగాల భర్తీ ద్వారా ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. ప్రజలు కూడా దీనిని గుర్తించినట్లు ఓటింగ్ ద్వారా కనబడుతోంది. 50శాతం మంది ఉద్యోగ నియామకాలకు టాప్ రేటింగ్ ఇవ్వగా, 2వ స్థానంలో హైడ్రా, మూడవ స్థానంలో రుణమాఫీ నిలిచాయి.
………..