చంద్రబాబు సర్కార్ మోసాలపై అన్నదాతల నిరసనకు వైఎస్సార్‌సీపీ బాసట
నేడు అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీలు ,సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు
సూపర్ సిక్స్ హామీలో చెప్పినట్టుగా పెట్టుబడి సాయంగా రైతులకు రూ.20వేలు చొప్పున వెంటనే అందించాలి ,ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే
దళారీ వ్యవస్థను నిర్మూలించి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ,ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్
గ్రామస్థాయిలో రైతులకు తోడుగా నిలిచిన ఆర్బీకేలు ఇప్పుడు నిర్వీర్యం ,‘మద్దతు’ కరువై అన్నదాత విలవిల.. జాడలేని వ్యవసాయ సలహా మండళ్లు
ఐదేళ్లలో రైతన్నలకు రూ.1,88,541 కోట్ల మేర లబ్ధి చేకూర్చిన వైఎస్ జగన్ ,రైతు భరోసా కింద ఏటా రూ.12,500 ,నాలుగేళ్లలో రూ.50వేలను సాయంగా అందిస్తానని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ హామీ ,అధికారంలోకి రాగానే ఒక్కో రైతుకు ఏడాదికి రూ.13,500,ఐదేళ్లలో రూ.67,500 పెట్టుబడి సాయంగా అందించిన వైఎస్ జగన్.